Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో 'సలార్' కూడా ఒకటి. ఈ సినిమాను ప్రశాంత్ నీల్.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. ఊహకందని విధంగా హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో ‘సలార్’ కూడా ఒకటి. ఈ సినిమాను ప్రశాంత్ నీల్.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. ఊహకందని విధంగా హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి. ప్రభాస్ కెరీర్లోనే ఇది ఊర మాస్ సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇప్పటికే లీక్ అయిన ఫోటోలు, వీడియోలు ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెంచేశాయి. అయితే ఇప్పటి వరకు సలార్ నుంచి జస్ట్ ప్రభాస్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. అలాగే లీక్డ్ పిక్స్ తప్పితే సలార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. కానీ ఇప్పుడు.. సలార్ టైం దగ్గర పడినట్టేనని అంటున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ హెల్త్ కారణంగా కాస్త షూటింగ్ లేట్ అయ్యేలా ఉందంటున్నారు. కానీ వీలైనంత త్వరగా ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయాలని చూస్తున్నారు. అంతేకాదు సమ్మర్ నుంచే సలార్ సందడి స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఈ సమ్మర్లో సలార్ టీజర్, గ్లింప్స్ వంటి వీడియోలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. అప్పటి నుంచే సినిమా భారీ హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నాడట. అతి త్వరలోనే సలార్ అప్డేట్స్ బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయట. అదే జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే. ఇప్పటి వరకు జస్ట్ పోస్టర్స్, లీక్డ్ పిక్స్తోనే సరిపెట్టుకున్నారు అభిమానులు. ఇక టీజర్ రిలీజ్ అయితే.. సినిమా రిలీజ్ వరకు సోషల్ మీడియా షేక్ అవాల్సిందే. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.