KMM: మధిర మండల సహాయ వ్యవసాయ సంచాలకులు విజయ్ చంద్ర మంగళవారం మధిర మార్కెట్ యార్డును సందర్శించి రైతులు పండించిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ.. తేమశాతం 17 శాతంలోపు ఉండాలని, ఇతర నాణ్యత ప్రమాణాలను పాటించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని రైతులకు వివరించారు.