KNR: తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక తప్పుల తడకగా ఉందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి విమర్శించారు. కరీంనగర్లో మాట్లాడుతూ.. విద్యార్థి సంఘాల అభిప్రాయం తీసుకోకుండా నివేదిక ఎలా రూపొందిస్తారని ప్రశ్నించారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి లేకపోవడం సరికాదన్నారు. బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని అన్నారు.