TPT: చంద్రగిరి మండలం కొత్తఇళ్లు గ్రామంలో భారీ దొంగతనం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన సిద్ధులు నాయుడు కుటుంబం శనివారం ఇంటికి తాళాలు వేసి తిరుపతిలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. ఇదే అవకాశంగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంటిలోని రూ.6 లక్షలు నగదు, సుమారు 200 గ్రాముల బంగారాన్ని దోచుకుపోయారు.