ELR: పోలవరం మండలం గుంజవరంకి చెందిన రాంబాబు (46) మృతిపై అతని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. రాంబాబు నవంబర్ 28న పురుగుమందు సేవించడం జరిగిందని, రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. రాంబాబు మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కుమారుడు రవీంద్ర శనివారం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.