సత్యసాయి: జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో పౌర సరఫరాల ఉప తహసీల్దార్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. నిత్యావసర వస్తువుల చట్టం-1955 ప్రకారం అక్రమ రవాణా చేసే వారిపై సెక్షన్ 7 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జేసీ ఆదేశించారు. రేషన్ షాపులు నిర్ణీత సమయాల్లో తెరవాలని, 65 ఏళ్లు పైబడిన వారికి ఇంటి వద్దకే సరుకులు అందించాలని ఆయన సూచించారు.