KDP: సిద్ధవటం(మం) మాధవరం ఎస్కేఆర్ నగర్లో లారీ డ్రైవర్ కోటపాటి బాబు రాజు(48) మద్యం మత్తులో భార్యతో గొడవ తర్వాత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ్ముడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉండగా, కుటుంబంలో విషాదం నెలకొంది.