ADB: ఆదివాసీలు విద్యకు మొదటి ప్రాధాన్యతను కేటాయించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గాదిగూడ మండలంలోని పొన్నూరు, దాబా గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు. ఆదివాసీలు నాటు వైద్యాన్ని నమ్మకుండా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, ఆదివాసీ పెద్దలు తదితరులున్నారు.