»Mumbai Cyber Safe Actor Politician Nagma Morarji Loses %e2%82%b91 Lakh In Kyc Fraud After Clicking On Spam Link
Cyber Crime : దారుణంగా మోసపోయిన నటి నగ్మ…!
Cyber Crime : ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. చాలా మంది సైబర్ కేటుగాళ్ల వలలో పడి దారుణంగా మోసపోతున్నారు. వీరి జాబితాలోకి సినీ నటి నగ్మ కూడా చేరడం గమనార్హం. ఆమె సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి దాదాపు రూ.లక్ష పోగొట్టుకున్నారు. తన మొబైల్ కి వచ్చిన మెసేజ ని క్లిక్ చేయడంతో... ఆమె దాదాపు రూ.లక్ష పోగొట్టుకున్నారు.
ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. చాలా మంది సైబర్ కేటుగాళ్ల వలలో పడి దారుణంగా మోసపోతున్నారు. వీరి జాబితాలోకి సినీ నటి నగ్మ కూడా చేరడం గమనార్హం. ఆమె సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి దాదాపు రూ.లక్ష పోగొట్టుకున్నారు. తన మొబైల్ కి వచ్చిన మెసేజ ని క్లిక్ చేయడంతో… ఆమె దాదాపు రూ.లక్ష పోగొట్టుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే… ఫిబ్రవరి 28వ తేదీన నగ్మా ఫోన్ కి బ్యాంక్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. కేవైసీకి సంబంధించిన లింక్ కావడంతో ఆమె వెంటనే దానిని క్లిక్ చేశారు. లింక్ ఓపెన్ చేయగానే… ఆమెకు బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చిందట. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను బ్యాంక్ ఎంప్లాయిగా పరిచయం చేసుకున్నాడు. కేవైసీ అప్ డేట్ చేయమని చెప్పారు. ఆమె తన బ్యాంక్ వివరాలు చెప్పనప్పటికీ… బెనిఫిషియరీ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాదాపు రూ.లక్ష ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. తన డబ్బులు పోయినందుకు ఆమె చాలా బాధ వ్యక్తం చేశారు.
నగ్మ మాదిరిగానే ఆ బ్యాంకుకు సంబంధించిన దాదాపు 80 మంది కూడా ఇదే విధంగా మోసపోవడం గమనార్హం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.