ELR: శనివారం ఉదయం ఏలూరు పట్టణం శనివారపుపేటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ మహేష్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల దాదాపు 63 లక్షల మంది పెన్షన్ దారులకు నెలకు రూ. 2,734 కోట్ల పెన్షన్లు కింద అందిస్తున్నామని, ఒక్క ఏలూరు జిల్లాలోనే 2,58,275 మంది పెన్షన్ దారులకి ప్రతి నెల రూ. 113 కోట్లకు పైగా పంపిణీ చేస్తున్నామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.