NTR: ఏ. కొండూరు తండా రైతులు మేజర్ కాలువ చివరి వరకు నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తూ కాలువలోకి దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం నాయకుడు జెట్టి వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. కాలువ కింద వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, వరి, మిర్చి, కూరగాయల పంటలు సాగులో ఉన్నాయని, వెంటనే నీళ్లు విడుదల చేసి చివరి వరకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.