AP: ప్రజలు కట్టబెట్టిన భారీ మెజార్టీతో కేంద్రంలో పరపతి పెరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. దీంతో కేంద్రం కూడా సహకరిస్తోందని తెలిపారు. ‘మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. విజయనగరం పండ్ల తోటలకు కేంద్రంగా మారాలి. అన్నదాత సుఖీభవ ఇస్తామని హామీ ఇచ్చాం.. మాట నిలబెట్టున్నాం. డీఎస్సీ నిర్వహించి పెద్ద ఎత్తున పోస్టులు భర్తీ చేశాం’ అని పేర్కొన్నారు.