»Satvik Suicide Case Cancellation Of Sri Chaitanya College Permission Next Academic Year
Satvik Suicide Case: శ్రీచైతన్య కాలేజీ అనుమతి రద్దు!
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి సాత్విక్(Satvik) ఆత్మహత్య(Suicide) చేసుకున్న నార్సింగి(narsingi) శ్రీచైతన్య కాలేజీ((sri chaitanya junior college) అనుమతిని రద్దు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి సాత్విక్(Satvik) ఆత్మహత్య(Suicide) చేసుకున్న నార్సింగి(narsingi) శ్రీచైతన్య కాలేజీ((sri chaitanya junior college) అనుమతిని రద్దు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. మరోవైపు కాలేజీల తప్పుడు ప్రకటనలను నియంత్రించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్(naveen mittal) తెలిపారు. దీంతోపాటు తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాల సమావేశంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇష్టం వచ్చిన రీతిలో తరగతులు నిర్వహించడంతోపాటు విద్యార్థులతో అధిక సమయం చదవాలని ఒత్తిడి తెస్తున్నట్లు పలువురు అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో అదనంగా క్లాసులు నిర్వహించే కళాశాలలపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. కేవలం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే క్లాసులు జరపాలని అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటికే రంగారెడ్డి జిల్లా నార్సింగి(narsingi)లో శ్రీచైతన్య కాలేజ్(sri chaitanya junior college) విద్యార్థి సాత్విక్(Satvik) సూసైడ్(Suicide) కేసులో అతనిపై వేధింపులు(Harassment) నిజమేనని ప్రభుత్వ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో శ్రీచైతన్య కాలేజీలోని సిబ్బందిని విచారణ చేసి ప్రభుత్వానికి రిపోర్టును సమర్పించింది. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిట్టర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ 5 రోజుల పాటు విచారణను చేపట్టి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మరోవైపు శ్రీచైతన్య కాలేజీలో అసలు పాటించాల్సిన కనీస ప్రమాణాలతోపాటు రూల్స్ కూడా అతిక్రమిస్తున్నట్లు కమిటీ తెలిపింది.
ఫిబ్రవరి 28న నార్సింగి శ్రీచైతన్య కాలేజీ(sri chaitanya junior college)లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి సాత్విక్ సూసైడ్ లెటర్(letter) రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ లేఖలో కాలేజ్ ప్రిన్సిపల్, ఇంఛార్జీ, లెక్చరర్ పెట్టిన టార్చర్ వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సాత్విక్ పేర్కొన్నాడు. ఆ క్రమంలో కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేష్ పెట్టిన ఇబ్బందులను తట్టుకోలేక పోయాయని రాసుకొచ్చాడు. ఆ టార్చర్ తట్టుకోవడం నా వల్ల కాలేదు. అందుకే సూసైడ్ చేసుకుంటున్నానని సాత్విక్ లెటర్లో వెల్లడించాడు. అంతేకాదు తన హాస్టల్లో(hostel) వీరు ముగ్గురు విద్యార్థులకు టార్చర్ చూపించారని వెల్లడించాడు. ఈ క్రమంలో వారిపై తప్పకుండా యాక్షన్(action) తీసుకోవాలని తన అమ్మను లేఖ(letter)లో కోరాడు.