AP: CPI నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తిరుమల లడ్డూ వివాదం తప్పా మరే సమస్యలు లేవా? రాజకీయ పార్టీల నేతలకు పాల బాధితుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. ఫుడ్ మొదలు రాజకీయాల వరకు అన్నీ కల్తీ, సరైన పర్యవేక్షణ లేకనే కల్తీ పెరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వైద్యంపై ప్రభుత్వాలు ఫోకస్ పెరగాలని, అధికారంలో ఉన్నవారి దోపిడీ పెరుగుతోందన్నారు.