AP: అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. ప్రముఖ ప్రవచనకర్తలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, ప్రముఖ సినీ రచయిత తనికెళ్ల భరణి, ఎమ్మెల్యే ఆనందరావు హాజరయ్యారు. దివంగత నందమూరి తారక రామారావు ప్రాంగణంగా నామకరణం చేశారు.