నంద్యాల: శ్రీ గురురాజ విద్యాసంస్థల డైరెక్టర్ షేక్షావలి రెడ్డి శుక్రవారం మంత్రి ఎన్ఎండి ఫరూక్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 1న గోస్పాడు (మం) బాబానగర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ గురురాజ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ‘ప్రవాహ్’ పేరుతో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.