W.G: టీడీపీ అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్లు వెళ్ళవని గతంలో వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. శనివారం తణుకు మండలం తేతలి గ్రామ శివారు కొండాయపాలెం గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ.. మొదటి రోజే 99% పెన్షన్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. అనంతరం గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు.