GNTR: ఖాజీపాలెంలోని ఎస్టీ కాలనీలో శుక్రవారం రాత్రి ఎస్సై మర్రి వెంకట శివకుమార్ యాదవ్ ‘పల్లె నిద్ర’ నిర్వహించారు. ఎస్పీ, సీఐల ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో, ఆయన గ్రామస్తులకు శాంతిభద్రతల ప్రాముఖ్యతను వివరించారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలు మరియు అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.