T20 WC-2026లో భాగంగా రేపు టీమిండియా వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 30 T20 మ్యాచుల్లో తలపడ్డాయి. IND 19, WI 10 మ్యాచులు గెలిచాయి. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. భారత్ స్వదేశంలో 8, వెస్టిండీస్ గడ్డపై 5, తటస్థ వేదికలపై 6 మ్యాచులు గెలిచింది. కరేబియన్ జట్టు స్వదేశంలో 5, భారత గడ్డపై 2, తటస్థ వేదికలపై 3 మ్యాచుల్లో విజయం సాధించింది.