Special Team for Cyber Crime Complaints: పెరుగుతోన్న సైబర్ క్రైమ్స్..ప్రత్యేక టీమ్ ఏర్పాటు
టెక్నాలజీ(Technology) మారుతున్న కొద్దీ ఆ టెక్నాలజీని వాడుకుని మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ నేరాలు(Cyber Crimes) రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ ఉంటే చాలు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రెచ్చిపోయి నేరాలకు పాల్పడుతున్నారు. ఖాతాదారులకు తెలియకుండానే వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం అయిపోతున్నాయి. సామాన్య ప్రజలకు సైబర్ క్రైమ్స్(Cyber criminals) గురించి అంతగా అవగాహన లేకపోవడం వల్ల ఈ నేరాలు ఎక్కువవుతున్నాయి.

ములుగు జిల్లాలో కూడా ప్రజలు సైబర్ క్రైమ్స్(Cyber criminals) బారిన పడుతున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లాలో ఈ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఎస్పీ గాష్ ఆలం ఆధ్వర్యంలో నిర్వహించారు. గుర్తు తెలియని వారి నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయడం, ఓటీపీ(OTP)లు చెప్పడం వంటివి చేయకూడదని ఎస్పీ గాష్ ఆలం ప్రజలకు సూచించారు.
జిల్లాలోని సైబర్ క్రైమ్(Cyber Crimes) టీమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు ఎస్పీ గాష్ ఆలం తెలిపారు. సైబర్ నేరాలు జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా మొత్తం నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు అందుబాటులో ఉన్నారన్నారు.
ములుగు జిల్లా పరిధిలో సైబర్ నేరాలు(Cyber Crimes) జరిగితే వెంటనే ప్రజలు ఈ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. మోసాలకు గురి అయిన వెంటనే ఈ నెంబర్లను సంప్రదించాలని, లేదా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్1930 ను కూడా సంప్రదించి సైబర్ నేరాల(Cyber Crimes)పై ఫిర్యాదు చేయాలని ఎస్పీ గాష్ ఆలం వెల్లడించారు.