»Another Party Named Trs To Be Established In Telangana
TRS : తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ.. ఎవరు పెడుతున్నారో తెలుసా?
నిజానికి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించిందే.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని చూసి. కానీ.,. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా పార్టీ పేరును మార్చేశారంటూ కొందరు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు
TRS : టీఆర్ఎస్ అనగానే మనకు గుర్తొచ్చేది తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ పార్టీకి, తెలంగాణకు విడదీయలేని బంధం ఉంది. 2001 లో ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెట్టిన పార్టీ అది. ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న ఆ పార్టీ కాస్త రాజకీయ పార్టీగా మారిపోయింది. చివరకు ఆ పార్టీ పేరునే కేసీఆర్ మార్చేశారు. తెలంగాణ పేరును తీసేసి భారత పేరును పెట్టి బీఆర్ఎస్ గా నామకరణం చేశారు. టీఆర్ఎస్ అనే పేరు ఇప్పుడు తెలంగాణలో వినిపించడం లేదు.
నిజానికి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించిందే.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని చూసి. కానీ.,. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా పార్టీ పేరును మార్చేశారంటూ కొందరు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. దాన్నిక్యాష్ చేసుకోవడం కోసం కొందరు నాయకులు అదే టీఆర్ఎస్ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీని పెట్టాలని భావిస్తున్నారట.
TRS : తెలంగాణ రాజ్య సమితిగా రానుందా?
టీఆర్ఎస్ పేరు వచ్చేలా కొందరు నేతలు కలిసి పార్టీని పెట్టాలని యోచిస్తున్నారట. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పలువురు నాయకులు కలిసి ఈ పార్టీని పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాజ్య సమితిగా లేదంటే తెలంగాణ రైతు సమాఖ్య పేరుతో పార్టీని పెట్టాలని అనుకుంటున్నారట. అయితే.. ఇప్పటికే తెలంగాణ రాజ్య సమితి పేరుతో పార్టీ రిజిస్టర్ అయి ఉండటంతో తెలంగాణ రైతు సమాఖ్య పేరుతో పార్టీని పెట్టి తెలంగాణ ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నట్టు సమాచారం. పార్టీ జెండా కలర్ కూడా పింక్ ఉండేలా చూసుకొని ఈ పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చాలా జిల్లాల్లో కొందరు అసంతృప్తి నేతలు ఉన్నారు. వీరంతా కలిసి వచ్చి తెలంగాణ సెంటిమెంట్ తో పార్టీ పెట్టి పలువురు ఇతర నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానించి అసలైన తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే ఈ పార్టీని పెట్టే యోచనలో ఉన్నారట. చూద్దాం మరి టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పురుడు పోసుకుంటుందో?