TG: మంచిర్యాల(D) నస్పూర్‌కు చెందిన స్పందన(22) USలోని ఇల్లినాయిస్లో మెట్రో స్టేషన్ వద్ద 25 అడుగుల ఎత్తు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె చికాగో సమీపంలోని ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది. తండ్రి క్యాబ్ డ్రైవర్ కావడంతో ఆర్థిక స్తోమత లేక, పాస్‌పోర్ట్, వీసా లేక తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. తమును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.