RR: చేవెళ్ల పట్టణంలోని 12వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త చెదారాన్ని పారిశుద్ధ్య కార్మికులు తొలగించి పరిసరాలను శుభ్రపరచారు. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న కౌన్సిలర్ మనిషా అనంత రెడ్డి వార్డు ఆఫీసర్ చంద్రకాంత్‌తో కలిసి ఈ పనులు చేపట్టడంతో కాలనీవాసులు ప్రశంసలు కురిపించారు.