T20 WCలో చోటు దక్కించుకోలేకపోయిన గిల్ IPLలో మాత్రం అదరగొట్టాడు. 732 పరుగులతో టోర్నీలోనే రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అయితే, గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్‌లో చేసుకున్న మార్పులతోనే ఇది సాధ్యమైందని అశ్విన్ తెలిపాడు. బ్యాట్‌ను ప్యాడ్స్ దగ్గరికి తెచ్చి స్వింగ్ అవుతున్న బంతులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడని చెప్పాడు. అందుకే పరుగుల వరద పారించాడని అన్నాడు.