NTR: వచ్చే నెల 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీ హాస్టళ్లు, గురుకులాల భవనాలను సిద్ధం చేయాలని మంత్రి సవిత ఆదేశించారు. హాస్టళ్లు, తరగతి గదులు, విశ్రాంతి గదులను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందించాలని సూచించారు. అలాగే విద్యార్థుల అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు.