TG: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరుకావాలని సిట్ తెలిపింది. 2014-18 మధ్య మహేశ్వరం ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి పనిచేశారు. కాగా ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులను సిట్ విచారించిన విషయం తెలిసిందే.