BDK: దుమ్ముగూడెం మండలం లింగాపురం బీట్లో అటవీ శాఖ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు. రూ. 1,86,712 విలువ గల టేకు దిమ్మెలను స్వాధీనం చేసుకుని భద్రాచలం డిపోకు తరలించారు. ఈ దాడుల్లో పర్ణశాల FSO అన్నపూర్ణ, FBO ఎస్కే రహీం, లింగంపల్లి బీట్ ఆఫీసర్ రమేష్ పాల్గొన్నారు.