AKP: నాతవరం మండలం వెన్నెలపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పూర్వ విద్యార్థులు బుధవారం శ్రమదానం నిర్వహించారు. పాఠశాల పునఃప్రారంభానికి ముందుగా ప్రాంగణాన్ని శుభ్రపరచి, భవనానికి రంగులు వేయించి, గార్డెనింగ్ పనులు చేపట్టారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా నాతవరం ఎస్సై వై. తారకేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దీంతో వారిని పలువురు అభినందించారు.