MLG: మంగపేట మండలం మల్లూరు గ్రామంలో అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కోడలి తిరుపతమ్మ కుటుంబాన్ని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇంఛార్జ్ బడే నాగజ్యోతి-జగదీష్ బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.