HYD: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు, మరణాల తగ్గింపుకు పటిష్ట చర్యలు చేపట్టాలని సీపీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. బ్లాక్ స్పాట్ల గుర్తింపు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, జీబ్రా క్రాసింగ్‌లు, గార్డ్ రైలింగ్‌లు, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థల మెరుగుదలపై దృష్టి సారించాలని సూచించారు. శాఖల సమన్వయంతో చర్యలు వేగవంతం చేయాలని పేర్కొన్నారు.