NLG: నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన పొట్టేపాక సైదులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమంలో బుధవారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కళ నెరవేరుతోందన్నారు.