KNR: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రోజున జరిగిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 117వ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్‌ను ఈ సందర్భంగా అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.