NRML : దస్తురాబాద్ మండలంలో 20 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రారంభించారు. టెంకాయ కొట్టి, రిబ్బన్ కట్ చేశారు. సబ్ సెంటర్లోని ల్యాబ్ ,పేషంట్స్ గదిని పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని డాక్టర్, సిబ్బందికి సూచించారు. ప్రజా ప్రభుత్వంలో ఆరోగ్య శాఖకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు.