NLR: విడవలూరు మండలంలోని ఊటుకూరు, ముదివర్తి గ్రామాలలోని వేరుశనగ పొలాలను కోవూరు ఏడీఏ అనిత బుధవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఊటుకూరులో అధిక యూరియా వాడకం వలన కలిగేటువంటి అనర్ధాలపై రైతులకు అవగాహన చేశారు. పంటకు తగిన మోతాదులోనే ఎరువులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త కిరణ్ కుమార్, ఎంఏఓ లక్ష్మి, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.