HYD: సికింద్రాబాద్ సంచాలన్ భవన్లో ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ రెండు కొత్త సెక్షన్ కంట్రోల్ బోర్డులను పరిశీలించారు. సికింద్రాబాద్ డివిజన్లోని కొత్త సెక్షన్లలో (వాడి-రాయచూర్, పగిడిపల్లి-విష్ణుపురం-జనపహాడ్) రైలు రాకపోకల పర్యవేక్షణ కోసం చేపట్టిన కార్యాచరణ ఏర్పాట్లను ఆయన సమీక్షించి, అధికారుల సన్నద్ధతపై సంతృప్తి వ్యక్తం చేశారు.