E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో బుధవారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యతను, పురోగతిని పర్యవేక్షించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు & కాంట్రాక్టర్కు పలు కీలక సూచనలు చేశారు.