AP: DSC నిర్వహణలో అవినీతి జరిగిందంటూ YCP చేస్తున్న ఆరోపణలకు CM చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. పారదర్శకంగానే DSCని నిర్వహించామని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగణంగానే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చామని స్పష్టం చేశారు. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న YCP నేతలు వారి దగ్గర ఆధారాలుంటే బయటపెట్టాలని సవాలు విసిరారు. YCP నేతలు బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారని CM ఫైరయ్యారు.