KMR: జిల్లా విద్యాశాఖాధికారిగా (డీఈవో) ఎల్.మల్లికార్జున్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష సమన్వయకర్తల బృందం, కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లా విద్యాభివృద్ధికి ఆయన సేవలు మరింత దోహదపడాలని ఆకాంక్షించారు.