కోనసీమ: కొత్తపేటకు చెందిన కుడిపూడి సాయి రామ్, మహాలక్ష్మి దంపతులు కుటుంబ సమేతంగా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్‌కు రూ.25 వేల విరాళాన్ని సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు దంపతులకు ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రాలతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని అందించారు.