ASR: అరకులోయ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య “వెన్నుపోటు రెండేళ్లు” నిరసన కార్యక్రమాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జూన్ 4 నుంచి 12 వరకు పంచాయతీ నుంచి జిల్లా కేంద్రాల వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.