MNCL: జన్నారం మండలంలోని సింగరాయిపేట క్లస్టర్ పరిధిలో ఉన్న రైతులకు పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఏఈవో అక్రమ్ తెలిపారు. జీలుగా, జనము, పిల్లి పెసర విత్తనాలను చింతగూడ, పోన్కల్ పీఎసీఎస్లు, అగ్రోస్ జన్నారం, మురిమడుగు, డీసీఎంఎస్ ఇందన్పల్లిలో తీసుకోవచ్చన్నారు. విత్తనాలు కోసం రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్లను తీసుకువెళ్లాలని కోరారు.