CTR: జిల్లాలో మామిడి రైతులు అధికంగా తోతాపురి రకాన్ని సాగు చేస్తున్నారు. గత ఏడాది దిగుబడులు అధికంగా ఉన్నా.. ధర లేక రైతులు నష్టపోయారు. ఈసారి వాతావరణ పరిస్థితులతో దిగుబడులు సైతం తగ్గాయి. అయినా, ఆశించిన ధర లభించడం లేదు. సీజన్ ప్రారంభం కావడంతో గుజ్జు ఫ్యాక్టరీలు టన్నుకు రూ.7 వేలు, మండీలలో రూ.5 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.