SKLM: ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వారి సమస్యలను దరఖాస్తు రూపంలో కేంద్రమంత్రి అందజేశారు. దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.