SDPT: ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో మూల నక్షత్ర విశేష పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు, చండీ హోమం ఘనంగా నిర్వహించారు. క్షేత్రానికి విశేష సంఖ్యలో తరలి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.