అఫ్ఘానిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్టులో సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత 4 నెలలుగా సిరాజ్ విశ్రాంతి లేకుండా మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. దీంతో అతడేమి రోబో కాదని, ఇలానే కొనసాగితే గాయలపాలయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. సిరాజ్ వర్క్‌లోడ్‌ను దృష్టిలోపెట్టుకుని అతడికి బ్రేక్ ఇవ్వడమే మంచిదని BCCIకి సూచిస్తున్నారు.