TG: వరంగల్ ఖిల్లా ఖుష్మహల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథి, మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్య శారద, డీసీపీ అంకిత్ కుమార్తో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రగతి సందేశాన్ని అందించి, పలు పథకాల లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లను పంపిణీ చేశారు.