WNP: గోపాల్ పేట మండల పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపాల్ పేట ఎస్ఐ శశిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ నాగరాజు గస్తీ నిర్వహిస్తుండగా చెన్నూరు వాగు వద్ద ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను గుర్తించారు. అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.