త్రిపుర (Tripura), మేఘాలయ (Meghalaya), నాగాలాండ్ (Nagaland) వంటి ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడే ఉన్నాయి. ఇప్పటికే లెక్కింపు ప్రారంభమైంది. అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో, అలాగే మహారాష్ట్రలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు నేడు వెల్లడవుతున్నాయి.
మహారాష్ట్ర (Maharashtra)లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉప ఎన్నికలు జరిగాయి. ఇక్కడి కాస్బా పెఠ్ (Kasba Peth), చించ్వాడ్ (Chinchwad) నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా.. బీజేపీ, కాంగ్రెస్ చెరో స్థానంలో ముందంజలో ఉంది. కాస్బాలో కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర దాంగేకర్ ముందంజలో ఉన్నారు. 3వేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు. చించ్వాడ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అశ్విని జగ్తప్ 4వేల ఓట్ల మెజార్టీతో ముందున్నారు.
తమిళనాడులోని (Tamil Nadu) ఈరోడ్ (Erode) నియోజకవర్గం నుండి 77 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టైట్ సెక్యూరిటీ మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రంలో 48 సీసీటీవీలను ఏర్పాటు చేశారు. ఈరోడ్ ఉప ఎన్నికల ఇటు అధికార డీఎంకేతో పాటు అన్నాడీఎంకేకు కూడా చాలా కీలకం. ఉదయం పదిన్నర సమయానికి రెండు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ఈ రౌండ్లు పూర్తయ్యేసరికి డీఎంకే మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఎలాంగోవన్ (EVKS Elangovan) 12000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ కు 19223 ఓట్లు, అన్నాడీఎంకేకు 6497 ఓట్లు వచ్చాయి.
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లోని లూమ్లా (Lumla) అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి త్సేరింగ్ లాము (BJP candidate Tsering Lhamu) విజయాన్ని దక్కించుకున్నారు.
జార్ఖండ్ (Jharkhand)లో రామగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి (Ramgarh assembly constituency) ఉప ఎన్నికలు (Bypoll) జరిగాయి. ఇక్కడి నుండి 18 మంది బరిలో నిలిచారు. 3.34 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే మమతాను క్రిమినల్ కేసు కారణంగా డిస్-క్వాలిఫై చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. రామఘర్ నుండి AJSU (All Jharkhand Students Union) పార్టీకి చెందిన అభ్యర్థి సునితా చౌదరి ముందంజలో ఉన్నారు. బీజేపీ మద్దతు ఇచ్చింది.
పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని సాగర్దిఘి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. లెఫ్ట్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ కు 11 వేలకు పైగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 9వేలకు పైగా ఓట్లు వచ్చాయి.
ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర (Tripura), మేఘాలయ (Meghalaya), నాగాలాండ్ (Nagaland)లలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఈ మూడు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఇప్పటికే ట్రెండ్స్ తెలిశాయి. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలలో బీజేపీ, మిత్రపక్షాలు విజయం సాధిస్తున్నాయి. మేఘాలయలో హంగ్ కనిపిస్తోంది. త్రిపురలో బీజేపీ 30, లెఫ్ట్ 19 సీట్లు, TIPRA 13 సీట్లలో ముందంజలో, నాగాలాండ్ లో ఎన్డీపీపీ – బీజేపీ కూటమి 42, ఎన్పీఎఫ్ 3, ఎన్సీపీ 6, కాంగ్రెస్ 1 సీటులో ముందంజలో, మేఘాలయలో ఎన్పీపీ 20, బీజేపీ 6, కాంగ్రెస్ 6, ఇతరులు 27 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.