ASF: జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ నితికా పంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకాలకు ఎంపికైన పలువురు పోలీస్ అధికారులకు ఎస్పీ చేతుల మీదుగా అవార్డులను అందజేసి అభినందించారు.