AKP: జిల్లాలో శుక్రవారం జరిగిన 27 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 310 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 3,321 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,011 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.